MDK: చేగుంట మండలం రుక్మాపూర్లోని ‘గుడి బండలు’ అనే రాతిపై ఉన్న పురాతన శిథిల వైష్ణవాలయాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యుడు బుర్ర సంతోష్ పరిశీలించారు. ప్రస్తుతం ఈ ఆలయం ధ్వంసమై కేవలం మండపాలు మాత్రమే మిగిలాయని ఆయన తెలిపారు. ఆలయం వెలుపల నల్లరాతిపై చెక్కిన రాష్ట్రకూట శైలి నాటి సూర్యుడు, విష్ణుమూర్తి, సప్త మాతృకలు, నంది శిల్పాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు.