కాకినాడ కలెక్టర్ ఆదేశాల మేరకు పిఠాపురం పట్టణ పరిధిలోని అనధికార ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులు బుధవారం ఆదేశించారు. సరైన భద్రత లేని ఫ్లెక్సీలు గాలికి పడిపోవడం వల్ల ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. యజమానులే స్వచ్ఛందంగా వీటిని తొలగించాలని, లేనిపక్షంలో మున్సిపల్ సిబ్బందితో కఠినంగా తొలగిస్తామని హెచ్చరించారు.