NDL: శ్రీశైలంలో నియోజకవర్గంలో టిడిపి మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు, బండి ఆత్మకూర్, మహానంది మండలాల్లో పార్టీ నాయకులు ర్యాలీలు నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. దివంగత నేతలు ఎన్టీఆర్, బుడ్డ వెంగళరెడ్డి చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.