మెదక్ జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆర్డీవోలు, మండల అధికారులు, తాహసీల్దారులు, ఎంపీడీవోలతో గూగుల్ మీట్ నిర్వహించారు. రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం వేగంగా సేకరించి, లారీల కొరత లేకుండా మిల్లులకు తరలించాలని ఆమె అధికారులను ఆదేశించారు.