వ్యాపారవేత్త నుంచి నటుడిగా మారిన లెజెండ్ శరవణన్ నటించిన ‘లీడర్’ మూవీ OTTలోకి వచ్చేస్తోంది. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 3న రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీని డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. మే 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.