MNCL: రైతులు వరి ధాన్యాన్ని తడవకుండా చూసుకోవాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈవో అక్రమ్ సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో రెండు రోజులుగా అకాల వర్షాలు పడుతున్నాయని తెలిపారు. దీంతో ఎండకు ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోవడంతో తేమశాతం పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని తడవకుండా చూసుకోవాలన్నారు.