TG: సమ్మెకు వెళ్లే యోచనలో సింగరేణి కార్మికులు ఉన్నారు. సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరింది. జూన్ 2 వరకు ఎదురుచూస్తామని.. లేకుంటే సమ్మెకు వెళ్తామని హెచ్చరించింది.