RR: అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకదుర్గ కాలనీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో తల్లి, కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి కళావతి, కొడుకు శివ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.