SRPT: మఠంపల్లి మండల కేంద్రంలోని ప్యాక్స్ ఎరువుల గిడ్డంగిలో రైతులకు 50 శాతం రాయితీపై జిలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ప్యాక్స్ చైర్మన్ జవ్వాజి రామచంద్రయ్య, తహసీల్దార్ మంగ, ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. 30 కేజీల బ్యాగు ధర రూ. 2452.50 మాత్రమేనని తెలిపారు. రైతులు పట్టా పాస్‌బుక్, ఆధార్ జిరాక్స్‌తో విత్తనాలు పొందాలని సూచించారు.