రష్యా నుంచి మరిన్ని ఎస్-400లను కొనుగోలు చేసేందుకు భారత్ చర్చలు జరుపుతుంది. అయితే ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ సర్వీసెస్ ఫర్ మిలిటరీ టెక్నికల్ కోపరేషన్ ధ్రువీకరించింది. ప్రస్తుతం కొనుగోలు చేసిన ఐదు రెజిమెంట్లను మించి కొనుగోలుకు యత్నాలు చేస్తుంది. మరో ఐదు రెజిమెంట్లకు డిఫెన్స్ అక్విజెషన్ కౌన్సిల్ నుంచి అనుమతులు వచ్చాయి.