KNR: జమ్మికుంట మండలం బిజిగీర్ షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లను మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవి, సీఐ రామకృష్ణ గౌడ్‌తో కలిసి దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. ఉర్సు ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు రానుండటంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.