మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రేగులగూడెం గ్రామంలో బ్లాక్ క్యాట్ బీభత్సం సృష్టించింది. అడవి నుంచి బయటికి వచ్చి గ్రామస్థులపై ఒక్కసారిగా దాడి చేసింది. బ్లాక్ క్యాట్ దాడిలో ఐదుగురు గ్రామస్థులు తీవ్రంగా గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. గ్రామస్థులంతా దానిపై దాడి చేయడంతో బ్లాక్ క్యాట్ చనిపోయిందన్నారు.