NDL: బనగానపల్లె మండలంలో నందవరం చౌడేశ్వరి మాత వైశాఖ మాసం బుధవారం ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, చైర్మన్లు పీవి నాగార్జున రెడ్డి, పీవీ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చక బృందం కుంకుమార్చన, రుద్రాభిషేకం మహా మంగళహారతి, విశేష పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.