విజయనగరం మెసానిక్ టెంపుల్లో (క్లస్టర్ నెంబర్లు 5, 6, 8) ఏర్పాటు చేసిన ‘మహానాడు-2026’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.