AP: ‘మహానాడు’ సందర్భంగా భారీ ప్రకటన ఉంటుందని మంత్రి లోకేష్ ‘X’లో పోస్ట్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా తన తొలి మహానాడు సందర్భంగా భారీ ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇవాళ, రేపు మహానాడు కార్యక్రమం నిర్వహించనున్న సంగతి తెలిసిందే.