తన బ్యాటింగ్ స్టైల్‌పై RCB కెప్టెన్ రజత్ పటిదార్ స్పందించాడు. ‘ఇన్నింగ్స్ ప్రారంభంలో పిచ్ ఎలా ఉందో.. బంతి ఎలా వస్తోంది అనేది గమనించడానికి నేను ఒక 8-10 బంతులు తీసుకుంటాను. ఆ తర్వాత, మ్యాచ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై నాకు ఓ క్లారిటీ వస్తుంది. ఇక పిచ్ ఎలా ఉన్నా నేను భయపడను. బౌలర్‌ను ఎప్పుడూ ఒత్తిడిలోకి నెట్టడమే నాకు ఇష్టం’ అని చెప్పుకొచ్చాడు.