HYD: కాచిగూడలో మానసిక ఒత్తిడితో రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిరంజన్ (24) అనే యువకుడిని పోలీసులు సమయస్ఫూర్తితో రక్షించారు. యువకుడి తండ్రి ఇచ్చిన సమాచారంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు.