MHBD: కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు సారయ్య తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా అధికారుల ద్వారా పరిష్కరించేందుకు బుధవారం ఓటాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న రైతు వేదికలో కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు.