RR: గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఐటీఐ ప్రవేశాల దరఖాస్తు గడువును జూన్ 12 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ అర్షియా ఆజమ్ తెలిపారు. క్యాంపస్‌లో సివిల్, ఏసీ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ప్లంబింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు మనూ ప్రధాన క్యాంపస్‌లోని ఐటీఐ భవనంలో దరఖాస్తులు పొందవచ్చన్నారు.