KRNL: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు, రేపు టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని మంగళవారం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో 73 క్లస్టర్ల పరిధిలో వర్చువల్ మహానాడుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పార్టీ శ్రేణులకు సూచించారు.