SKLM: జిల్లాలో రహదారి భద్రతకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని SP మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం సామాజిక బాధ్యతగా ఆర్కే సోలార్ టెక్ సొల్యూషన్స్ , ఎస్బీఐ సహకారంతో జిల్లా పోలీస్ శాఖకు అందజేసిన సోలార్ బ్లింకర్లు, ట్రాఫిక్ స్టాపర్లను ఎస్పీ స్వీకరించారు. ప్రజల భద్రత కోసం ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వాములు కావడం అభినందనీయమని అన్నారు.