KNR: రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి జమ్మికుంట మార్కెట్ యార్డును సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. మార్కెట్ ఛైర్మన్ స్వప్న, తహసీల్దార్ వెంకట్ రెడ్డి, సీఐ రామకృష్ణలతో సమావేశమై శాఖల సమన్వయంతో శాంతిభద్రతలు కాపాడాలని సూచించారు.