WG: పాలకోడేరులో జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి స్వాగతం పలికారు. ఐజీ రికార్డులు, సిబ్బంది హాజరు, పరిపాలన ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతే పరమావధిగా పనిచేయాలని, బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు.