NDL: పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో తెల్లవారుజామున జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పాణ్యం నుండి కర్నూలు వైపు ఇద్దరు యువకులు బైకుపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. గాయపడ్డ బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.