TG: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సిద్దిపేట జిల్లా ముస్త్యాలలో 12.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో 11 సెం.మీ, నాగర్ కర్నూలులో 8.4 సెం.మీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచి.. వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.