TG: కరీంనగర్‌కు 100 రోజుల్లోనే రూ.840 కోట్ల నిధులు తెచ్చానని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ‘నిధులు తీసుకొచ్చేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎంపీగా గెలిచాక కరీంనగర్‌కు రూ.20 వేల కోట్లు తెచ్చాను. ధాన్యం కొనుగోలు డబ్బులు కేంద్రమే ఇస్తుంది. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన విమర్శించారు.