AP: చిత్ర పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని టాలీవుడ్ నిర్మాతలు తెలిపారు. సింగిల్ స్క్రీన్లకు పర్సంటేజ్ ఇవ్వడంతో పాటు, నిర్వహణ వ్యయం దృష్ట్యా విద్యుత్ ఛార్జీలో రాయితీ ఇవ్వాలని పవన్ను కోరామని.. అందరికీ న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి ఎలాంటి బాకీలు లేవని నిర్మాతలు చెప్పారు.