SRPT: జిల్లాలో 2025-26 విద్యాసంవత్సరానికి అర్హులైన ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల (ఫ్రెష్, రెన్యూవల్) ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 31 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె. దయానంద రాణి తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.