HYD: ఖైరతాబాద్ జలమండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి అజరుద్దీన్, ఎండీ అశోక్, ఉన్నతాధికారులతో కలిసి నగరంలో తాగునీటి సరఫరా, ట్యాంకర్ సేవలు, ఎస్టీపీల నిర్వహణపై చర్చించారు. నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపుపై దిశానిర్దేశం చేశారు. పర్యావరణ పరిరక్షణకు రవాణా శాఖ ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తోందని మంత్రి పేర్కొన్నారు.