KKD: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కాకినాడ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రైవేటు సంస్థల ఆహారం నాణ్యతలేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 8న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.