సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు శరీరాన్ని మంటెత్తిస్తున్నాయి. అయితే, ఈ కిరణాలు మన చర్మానికి అవసరమైన విటమిన్-డి ఉత్పత్తికి సహాయపడతాయి. ఎముకలు, రోగ నిరోధక వ్యవస్థ, రక్త కణాల పనితీరుకు కీలకం. కానీ, వీటి ప్రభావం ఎక్కువైతే చర్మం కమిలిపోతుంది. చర్మకణాల్లోని DNA దెబ్బతిని క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. చర్మం ముడతలు పడటానికి, వృద్ధాప్య ఛాయలు రావటానికి కారణమవుతుంది.