GDWL: మల్దకల్ కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం సందర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా. కురువ విజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గన్నీ బ్యాగులు, లారీల కొరతతో రోజులుగా రైతులు రోడ్లపైనే వేచి చూస్తున్నారన్నారు. అకాల వర్షాలకు మొక్కజొన్న తడిసి మొలకలు వస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.