VZM: డెంకాడ మండలం అమకాం పంచాయతీ దిబ్బగుడి గ్రామంలోని కోమటి చెరువులో జలధార పనులు వేగంగా సాగుతున్నాయి. చెరువులో మట్టి పూడిక తీత, గట్టు బలపరిచే పనుల్లో 180 మంది ఉపాధి పొందుతున్నారు. మూడు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు అభివృద్ధి పూర్తయితే 8.48 ఎకరాలకు సాగునీరు అందనుంది. భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు మేలు చేకూరనుంది.