వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఆ దిశగా అడుగులు వేసింది. ఆన్ ఫీల్డ్‌లో పనిచేయాల్సిన అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. వ్యాపార అవసరాలకు మాత్రమే విదేశీ పర్యటనలను పరిమితం చేయాలని.. ఆన్లైన్ సమావేశాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించింది.