GNTR: తెనాలి ఆటోనగర్‌లోని టీన్నర్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.