HNK: మీడియా రంగంలో అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల ఎన్నికైన హన్మకొండ జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నూతన కార్యవర్గం ఆయనను మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసింది. జర్నలిస్టుల హక్కుల సాధనకు యూనియన్ నాయకత్వం చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కేశవమూర్తి తదితరులు పాల్గొన్నారు.