పలు పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు టాటా ట్రస్ట్స్ జూన్ 8న సమావేశం కానుంది. టాటా సన్స్ బోర్డులో నామినీ డైరెక్టరుగా వేణు శ్రీనివాసన్ భవితవ్యంపై కూడా ఇందులో చర్చకు రావొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 16న ఈ సమావేశం జరగాల్సి ఉండగా అది వాయిదా పడింది.