PPM: వీరఘట్టం మండలం అచ్చపువలస సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో ఎండ తీవ్రతకు 1200 కోళ్లు మృతి చెందాయి. దాదాపు ఎనిమిది గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఫారంలో వేడి తీవ్రంగా పెరిగి కోళ్లు మృత్యువాత పడ్డాయని ఫారం యాజమాని మర్రి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తనకు సుమారు రూ.1.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.