E.G: గామన్ బ్రిడ్జిని రాజమండ్రి సిటీ, రూరల్ MLAలు పంచుకుంటూ ఇసుక దోపిడీ చేస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి స్తంభాల వద్ద వందలాది డ్రెడ్జింగ్ మిషన్లు, బోట్లతో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారన్నారు. దీనివల్ల బ్రిడ్జి ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలని కోరారు.