KNR: హుజూరాబాద్ పట్టణంలోని 23, 29వ వార్డులలో అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ రొంటాల సుహాసిని ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడేలా చేపట్టినట్లు పేర్కొన్నారు.