ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారిగా పీ.సాయిబాబు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇక్కడ పని చేసిన చిన ఓబులేసు తాడికొండ ఆర్డీవోగా వెళ్లడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. కాగా కృష్ణా మెప్మా పీడీగా ఉన్న సాయిబాబును జిల్లాకు తీసుకొచ్చారు.