MNCL: మందమర్రి ఏరియా KK-OCPలో పరిమితికి మించి బాంబు బ్లాస్ట్ తీవ్రతో ప్రభావిత ప్రాంతాలు చొప్పరపల్లి, ఇందిరమ్మ కాలనీ, భరత్ కాలనీ, ట్యాంక్ బస్తీలలో ఇళ్లకు బీటలు వారి రేకులు పగిలిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం సర్పంచ్ మౌనిక సంబంధిత అధికారులను పిలిపించి చర్చించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.