NRML: వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.