సత్యసాయి: పెనుకొండ మండలం కొండంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు వేణుగోపాలరెడ్డి (45) విద్యుత్ షాక్‌తో మరణించాడు. పొలంలో పనులు చేస్తుండగా ట్రాక్టర్ లిఫ్ట్‌కు కరెంట్ వైరు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.