ATP: ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. శింగనమల నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి సమస్యలకు సంబంధించిన ఆర్జీలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూలంగా విని, వాటిని వెంటనే పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.