NRPT: తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఆధ్వర్యంలో నర్వ రైతు సేవా కేంద్రంలో రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 30 కిలోల విత్తనాల బస్తా ధర రూ.2,452గా నిర్ణయించినట్లు ఏఈఓ అఖిల రెడ్డి తెలిపారు.