JGL: ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో ఈత, తాటి చెట్లు కాలిపోవడంతో నష్టపోయిన గీత కార్మికులను ఆదుకుంటామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు కాలిపోయిన ఈత, తాటి వనాన్ని మంగళవారం పరిశీలించారు. ఈత, తాటి చెట్లు కాలిపోవడంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని పేర్కొన్నారు.