KRNL: తుగ్గలి మండలం జొన్నగిరి జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రవి తెలిపారు. గుత్తి ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాలతో పాటు మజరా ప్రాంతాల ప్రజలు భూ సమస్యలు, ఇతర అర్జీలను PGRSలో సమర్పించవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, రెవెన్యూ సిబ్బంది తప్పనిసరిగా హాజరుకావాలని తహసీల్దార్ ఆదేశించారు.