TG: బండి భగీరథ్ కస్టడీ పిటిషన్‌పై మల్కాజిగిరి పోక్సో కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. వారంపాటు అతన్ని కస్టడీ కోరుతూ ఇటీవల పేట్‌బహీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పోక్సో కేసులో ఈనెల 16న బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.