AP: హైబ్రిడ్ విధానంలో మహిళా నాయకత్వ ప్రోత్సాహ థీమ్‌తో మహానాడు నిర్వహిస్తామని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. మహానాడు కేవలం TDP కార్యక్రమం మాత్రమే కాదని.. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే రోడ్‌మ్యాప్ అని వ్యాఖ్యానించారు. అనుభవం, యువతరం మేళవింపునకు వేదిక అవుతుందని వెల్లడించారు. 1800 క్లస్టర్స్‌తో గిన్నిస్ రికార్డ్ సాధించబోతున్నామన్నారు.